NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో హోరెత్తిన యువగళం పాదయాత్ర పొడవునా యువనేతకు స్వాగత నీరాజనాలు చౌటపాపాయపాలెం బహిరంగసభకు వెల్లువెత్తిన జనసందోహం

సత్తెనపల్లి/పెదకూరపాడు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 179వరోజు సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరెత్తింది. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండమోడులో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సత్తెనపల్లిలో మాజీమంత్రి, ఇన్ చార్జి కన్నాలక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కోడెల శివరాం, అబ్బూరి మల్లేశ్వరరావు తదితరులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. .భారీ గజమాలలతో లోకేష్ ను యువనేతను సత్కరించారు. అడగుడగునా హారతులతో మహిళల నీరాజనాలు పట్టారు. బాణాసంచా మోతలు, కార్యకర్తల కేరింతల నడుమ యువగళం యాత్ర ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో వివిధ వర్గాల ప్రజలు యువనేత ఎదుట తమ గోడు వెళ్లబోసుకుంటూ నాలుగేళ్ల సైకోపాలనలో నరకం చూస్తున్నామని ఆవేదన చెందారు. మరో తొమ్మిదినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు.  చౌటపాపాయపాలెంలో జరిగిన బహిరంగసభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. సభానంతరం పాదయాత్ర పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. రోడ్లకు ఇరువైపులా ప్రజలు యువనేతను చూసేందుకు బారులు తీరారు. 179వరోజు యువనేత లోకేష్ 17.9 కి.మీ.ల పాదయత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2391.6 కి.మీ.లు పూర్తయింది. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడురోజులపాటు యువనేత పాదయాత్ర కొనసాగనుంది.

సత్తెనపల్లి నేలపై పాదయాత్ర అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం. సత్తెనపల్లి  అదిరిపోయింది. పల్నాడు ముఖద్వారం, వికటకవి తెనాలి రామకృష్ణుడు జన్మించిన నేల, స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పుట్టిన గడ్డ, పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారు అభివృద్ధి చేసిన నేల సత్తెనపల్లి. ఎంతో ఘన చరిత్ర ఉన్న నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. కార్యకర్తల్ని వేధించిన వారిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా.  కాంబాబు అరాచకాలు నేను మర్చిపోను. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారు సత్తెనపల్లిలో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా.

వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారాంధ్రప్రదేశ్

వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారప్రదేశ్ గా మారిపోయింది. విద్యుత్ ఉద్యోగులు కూడా వైసీపీ బాధితులే. విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు టిడిపి పూర్తి మద్దతు ఇస్తుంది. టిడిపి హయాంలో విద్యుత్ ఉద్యోగులకు 25% ఫిట్మెంట్ ఇస్తే జగన్ కేవలం 7% ఫిట్మెంట్ ఇచ్చాడు. మూడు డిఏలు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగులరైజ్ చేస్తానని మోసం చేసారు . జిపిఎఫ్, పెన్షన్, లీవ్ ఫండ్ లో ఉన్న రూ.12 వేల కోట్లను పక్కదారి పట్టించాడు. పాదయాత్ర లో జగన్ విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. విద్యుత్ ఉద్యోగులు చెయ్యాల్సింది పెన్ డౌన్, సెల్ డౌన్ కాదు..జగన్ కి కరెంట్ షాక్ ఇవ్వండి అప్పుడు కానీ దున్నపోతు ప్రభుత్వం నిద్రలేవదు.

దమ్ముంటే బిల్లులపై స్టిక్కర్లు వేయండి

వైసీపీ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్.  అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసారు

మహిళల కోసమే మహాశక్తిపథకం

2వేల 300 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువత భవితను దెబ్బతీసిన వైసీపీ

వైసీపీ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు – అన్నదాతకు ఉరితాళ్లు

వైసీపీ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. వైసీపీ   పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగులు, పోలీసులనూ వదల్లేదు!

వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు వైసీపీతెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.

బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. వైసీపీ పాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న, సీఐ ఆనందరావు వరకూ వైసీపీ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైసీపీ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.

టిడిపి హయాంలోనే సత్తెనపల్లి అభివృద్ధి

టిడిపి హయాంలోనే సత్తెనపల్లి అభివృద్ధి చెందింది. 2014 నుండి 2019 వరకూ సత్తెనపల్లికి స్వర్ణయుగం.రూ.1400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, టిడ్కో ఇళ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, మరుగుదొడ్లు,  స్మశానాలను కూడా అభివృద్ధి చేసింది టిడిపి. చెరువులు నిర్మించి సత్తెనపల్లి పట్టణానికి తాగునీరు అందించాం. మెయిన్ రోడ్డు విస్తరించాం. ప్రభుత్వాసుపత్రిని నిర్మించాం. తారకరామ సాగర్, వావిలాల స్మృతి వనం ఏర్పాటు చేశాం.  సత్తెనపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయ, బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలు తీసుకొచ్చింది తెలుగుదేశం.

నాలుగేళ్లుగా ఏం చేశారు?

రాజుపాలెం మండలం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా..గత నాలుగేళ్లలో ఈ మండలంలో ఒక్క జగనన్న కాలనీలోనైనా ఒక్క ఇల్లయినా కట్టారా? బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి చంద్రబాబు గారు 38 కోట్ల నిధుల్ని మంజూరు చేయిస్తే ఈ నాలుగేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టావా నోటిదూల కాంబాబు. పులిచింతల పునరావాస  కాలనీల ప్రజల ఇబ్బందుల్ని ఏనాడైనా పట్టించుకున్నాడా? కొండమోడులో అవినీతి అనకొండ కాంబాబు అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకులు కోర్టుకెక్కారు.

మండలానికో బ్రోకర్ తో దోపిడీ!

మొన్నటి వరకు తమ్ముడు, ఇప్పుడు అల్లుడు, మండలానికి ఒక బ్రోకర్ని పెట్టుకొని దోచేస్తున్నాడు. ఋషికొండలా నకరికల్లు, రాజుపాలెం కొండలకి గుండు కొట్టి కోట్లు కొల్లగొడుతున్నాడు. చికెన్ వేస్టే తరలించే వాళ్ల దగ్గరా..  పుచ్చకాయల అమ్మే బండ్లు దగ్గరా వసూళ్లు చేస్తున్నాడంటే ఎంతకి దిగజారిపోయాడో అర్థం అవుతోంది. పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలు వేయించడంలోనూ, వారి వేతనాల్లోనూ  కాంబాబు వాటాలు అడుగుతున్నాడు.

పేదల ఇళ్లలోనూ అడ్డగోలు దోపిడీ

2019 ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో సెంటు స్థలం లేని అంబటి ఇప్పుడు అవినీతి సొమ్ముతో నియోజకవర్గమంతా పొలాలు, స్థలాలు కొనేశాడు. కొట్టేశాడు. సత్తెనపల్లి వినాయక హోటల్లో తురక అనిల్ అనే యువకుడు చనిపోతే ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు ఇస్తేనే చెక్కు ఇస్తానన్న అవినీతి కాంబాబు. రైతుల్ని బెదిరించి ఎకరా 10 లక్షలకి కొని సెంటు స్థలాల కోసం ప్రభుత్వానికి  ఎకరా 40 లక్షలకి అమ్మేసాడు కాంబాబు. 2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి 8 కోట్లకే అమ్మేందుకు కాంబాబు ప్రయత్నిస్తున్నాడు.

ఒక్క పిల్లకాల్వ అయినా తవ్వించావా?

మైకుల ముందు రంకెలు వేయడం కాదు.. ఇరిగేషన్ మంత్రిగా ఒక్క పిల్ల కాలువ అయినా తవ్వించావా? 2018లో గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు లోనే  చంద్రబాబు శ్రీకారం చుట్టారు.. దేశంలోనే తొలి నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు తెచ్చిన చంద్రన్న ప్రయత్నాలని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు కాంబాబు. టిడిపి పాలనలో 1500 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వుంటే సత్తెనపల్లి నియోజకవర్గం ఒక రేంజిలో ఉండేది. 80 శాతం టిడిపి సర్కారు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను 20 శాతం పూర్తి చేయలేని చేతకాని మంత్రి.

గంజాయికి అడ్డాగా మార్చేశాడు!

వైకాపా పాలనలో గంజాయి అడ్డాగా  సత్తెనపల్లి నియోజకవర్గం మారిపోయింది. ఏ2 విజయసాయిరెడ్డి బంధువులు సేఫ్ ఫార్మా కంపెనీలో ఉగ్రవాదులకి అవసరమైన డ్రగ్స్ తయారు చేస్తుంటే…మంత్రిగా ఏం చేస్తున్నావు కాంబాబు. ఓటమి భయంతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వేధిస్తున్నాడు. ధూళిపాళ్లలో ఉచిత వైద్య శిబిరానికి అనుమతిచ్చారని దళిత ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయించాడు కాంబాబు.

ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి ఇస్తాం

2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. సత్తెనపల్లి లో భారీ మెజారిటీతో టిడిపి ని గెలిపించండి. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పేదలకు టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తాం. మేజర్ స్టేడియం, షాది ఖానా భవనాల్ని పూర్తి చేస్తాం. చెక్ డాంల పనులను పూర్తి చేసి నీరందిస్తాం. పేరేచర్ల నుంచి కొండమోడ వరకు ప్రధాన రహదారి విస్తరిస్తాం. సత్తెనపల్లి అచ్చంపేట రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్రం తో సంప్రదించి అమలు అయ్యేలా చేస్తాం. రాజుపాలెం నకరికల్లు మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. కన్నా లక్ష్మీనారాయణని ఆశీర్వదించండి, టిడిపి ని గెలిపించండి.పులిచింతల పునరావాస కాలనీలని నగర పంచాయతీలతో సమానంగా అభివృద్ధి చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కొండమోడు గ్రామస్తులు

సత్తెనపల్లి నియోజకవర్గం కొండమోడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం కోటనెమలిపురి పంచాయతీతో ఉంది. మా గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి. గ్రామంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలి. 30 ఏళ్లుగా అటవీ భూమిలో నివాసం ఉంటున్న వీరమ్మకాలనీ, టి.యన్.నగర్ ప్రజలకు ఇంటి పట్టాలు ఇప్పించాలి. గ్రామంలో సరిగా రోడ్లు లేవు..డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నాం.  గ్రామంలో అందరూ కూలీ పనులపై ఆధారపడేవారే..వ్యవసాయ భూములు ఇప్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

పనులు మాత్రం గడపదాటడం లేదు. ఎన్నికల సమయంలో 500 జనాభా దాటిని గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఆ తర్వాత గాలికొదిలేశారు. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి అందించి, స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. అటవీ భూముల సమస్యను కేంద్రంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలుత తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన అనుపాలెం గ్రామస్తులు

సత్తెనపల్లి నియోజకవర్గం అనుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం గోదావరి ద్వారా పెన్నాఇంటర్ లింక్ ద్వారా హరిచంద్రపురం నుండి నకరికల్లు సాగర్ కాలువలోకి నీరు తీసుకుని వచ్చేలా ఫస్ట్ పేజ్ లో రూ.6 వేల కోట్లతో మొదలు పెట్టారు. ఇది పూర్తైతే 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అక్కడకు చేర్చిన మోటార్లు, పైపులు చెదలు పట్టిపోతున్నాయి. కృష్ణా ఎగువ భాగాన వరదలు లేని కారణంగా ఇంతవరకూ సాగర్ కు నీరు రాలేదు. గోదావరి – పెన్నా అనుసంధానం పూర్తైతే ఈపాటికే మా ప్రాంత రైతులు వరినాట్లు వేసుకునేవారు. TDP వచ్చిన తర్వాత గోదావరి – పెన్నా నదుల  అనుసంధానంతో పాటు రోడ్ల విస్తీర్ణించి ప్రాణాలు కాపాడాలి. మా ప్రాంతం నుండి పేరేచర్ల వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టి వెళ్లాల్సి వస్తోంది. 50 కి.మీ దూరం ఉన్న పేరేచర్లకు వెళ్లే సమయంలో ప్రతిరోజూ 2 ప్రమాదాలు జరుగుతున్నాయి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు చంద్రబాబునాయుడు. అందులో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశారు. హరిశ్చంద్రపురం వద్ద పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. 51నెలల క్రితం అధికారం చేపట్టిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. టీడీపీ ఐదేళ్లలో 68,294 కోట్లు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే వైసీపీ రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. టిడిపి అధికారంలో రాగానే గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్నిర్మాణం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన నాగిరెడ్డిపాలెం గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం నాగిరెడ్డిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ఉప్పునీరు వస్తుండటంతో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గ్రామంలోని 130 ఎకరాల చెరువులో కొంత భాగాన్ని మంచినీటికి ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. 130 ఎకరాల చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టుంది. దాన్ని అభివృద్ధి చేస్తే ఆ పరిధిలోని రైతులకు మేలు చేకూరుతుంది.  గ్రామంలో మురుగునీటి సమస్య ఉంది… సైడు కాల్వలు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చే నిధులను కూడా ఉపయోగించలేని అసమర్థుడు టిడిపి అధికారంలోకి రాగానే చెరువు బాగుచేసి నాగిరెడ్డిపాలెం రైతులకు సాగు,తాగునీరు అందజేస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన బెల్లంకొండ గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బెల్లంకొండ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. మురుగునీరు వెళ్లే మార్గంలేక కంపుకొడుతోంది. బెల్లంకొండ ఎంతో చరిత్ర కలిగిన కొండ. ఆ కొండపై శివాలయం కూడా ఉంది. దాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలి. వైసీపీ నేతలు సర్పంచ్ పదవిని ఉత్సవవిగ్రహంలా మార్చారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ లేవు. గ్రామంలో తాగునీటి సమస్య ఉంది..పరిష్కరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

డ్రైనేజీలు లేక గ్రామాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. గ్రామపంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన 14,15 ఫైనాన్స్ కమిషన్ నిధులు 9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం. దీంతో గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామపంచాయితీలకు అదనపు నిధులిచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం. బెల్లంకొండ శివాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన పులిచింతల ముంపు గ్రామాల ప్రజలు

పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ముంపు గ్రామాలైన ఆర్ అండ్ ఆర్ సెంటర్, న్యూ చిట్యాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామాల్లో పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురైన 700 కుటుంబాలు ఉన్నాయి. మేము మా తాతల తరం నుండి కేతవరం నరసింహస్వామి భూములకు శిస్తు కట్టుకుంటూ 7,500 ఎకరాలు సాగుచేసుకుంటున్నాం. మా పొలాలు మొత్తం పులిచించిల ప్రాజెక్టు కింద ప్రభుత్వం తీసుకుంది.  2009లో అప్పటి ప్రభుత్వం ఎకరాకు 1.5లక్షలు ఇస్తామని చెప్పి ఖాళీ చెక్కులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇప్పటికీ అందలేదు. భూమి దేవస్థానానికి అని, పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. జీవనాధారం కోల్పోయిన ఒక్కో కుటుంబనికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి. జీవనోపాధి కోల్పోయి పక్క గ్రామాల్లో కూలీ పనులకు వెళ్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక మా బతుకుదెరువు కోసం గేదెలు, గొర్రెలు ఇప్పించాలి. ప్రాజెక్టు కట్టేటప్పుడు మా కుటుంబంలోని పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు..కానీ ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేతవరం వజ్రలక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన స్వామి విగ్రహం  ముంపు గ్రామమైన కొండమీద పెట్టారు..ఆ గుడి దగ్గరకు వెళ్లాలంటే రోడ్డు లేదు, కరెంట్ లేదు. న్యూ చిట్యాల ఏర్పడి 15 ఏళ్లు అవుతున్నా ఇంత వరకూ స్మశానం లేదు. స్మశానం ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ముంపు బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీర్ఘకాలంగా పులిచింతల ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం అందకపోవడం దురదృష్టకరం. అధికారంలోకి వచ్చాక సాంకేతిక, న్యాయపరమైన చిక్కులను తొలగించి పులించిల ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తాం. కేతవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రహదారి, విద్యుత్ ఏర్పాటుచేస్తాం. ముంపు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానం ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం.

Also Read this Blog:Footprints of Progress: Naralokesh’s Padayatra Impact

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *