Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

తాడికొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం! అడుగడుగునా యువనేతకు సత్కారాలు, నీరాజనాలు

నేడు రాజధాని గ్రామాల్లో యువనేత లోకేష్ పాదయాత్ర

తాడికొండ: లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 183వరోజు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. యువనేతకు అడుగడుగునా జనం పెద్దఎత్తున గజమాలలతో సత్కరిస్తూ, హారతులతో నీరాజనాలు పట్టారు. సిరిపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని నాలుగేళ్ల పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. నిత్యావసర వస్తువులు, ఇంటిపన్నులు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడంతో బతుకుబండి లాగడం కష్టంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశానికి పెద్దఎత్తున రాజధాని రైతులు హాజరై తమ బాధలను చెప్పుకున్నారు. యువనేత పాదయాత్ర సిరిపురం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై వరగాని మీదుగా రావెల శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 183వరోజున యువనేత లోకేష్ 11.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2453.2 కి.మీ.ల మేర పూర్తయింది. సోమవారం నాడు యువనేత పాదయాత్ర రావెల నుంచి ప్రారంభమై… తాడికొండ అడ్డరోడ్డు మీదుగా రాజధాని గ్రామాల గుండా నిడమర్రు వరకు కొనసాగనుంది.

*అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతి నిర్మాణం*

*అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం… చేసి చూపిస్తాం*

*5కోట్ల భవిష్యత్తు నాశనం చేసిన విధ్వంసకుడు జగన్*

*అమరావతి త్యాగధనుల వెనుక 5కోట్లమంది ప్రజలు*

*కులం,మతం పేరుతో విషం చిమ్ముతున్న సైకోప్రభుత్వం*

 *ఇది అమరావతి ఆవేదన కాదు… ఆంధ్రప్రదేశ్ ఆక్రోశం!*

*రైతులను ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరినీ వదలం*

*అమరావతి రైతులతో ముఖాముఖిలో యువనేత లోకేష్*

అమరావతి: ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రప్రజల సమస్య, పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గతవైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోంది… పక్కరాష్ట్రాలను చూస్తే అసూయ కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతాం, రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం, అది చేసి చూపిస్తాం. కులం, మతం పేరుతో ప్రజారాజధానిపై ముఖ్యమంత్రి విషం చిమ్మారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్జేశారు. అమరావతి రైతులను వేధించిన ఏ ఒక్కరినీ వదలం. వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపించి ఉద్యోగాలనుంచి తొలగిస్తాం, అవసరమైతే కటకటాల వెనక్కి కూడా పంపిస్తాం. పాలన అంతంతోనే మళ్లీ రాష్ట్రానికి గత వైభవం చేకూరి అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అమరావతి రైతులు అవమానాలు పడ్డారు..లాఠీ, బూటు దెబ్బలు తిన్నారు. ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. అమరావతి రైతులకు TDP అండగా ఉంటుంది. నిలిపేసిన పనులు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

అమరావతిపై 5కోట్లమందిని ఏకతాటిపైకి తెచ్చాం

2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో తెలుసు. దశాబ్ధాలుగా మనం హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే ఇది మీ రాజధాని కాదని కట్టుబట్టలతో గెంటేశారు. విభజన చట్టంలో రాజధాని ఎక్కడో చెప్పలేదు. 5 ఏళ్లు మీరు ఏంచేశారని అన్నారు..5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఓకే రాష్ట్రం..ఒకే రాజధాని..అదే అమరావతి అని అనిపించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు మోడీ, చంద్రబాబు, జగన్ కూడా జై అమరావతి అన్నారు..అందుకే 3 పంటలు పండే భూమిని 29 వేల మంది రైతులు 33వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేశారు. రాజధాని ప్రకటన సమయంలో 13 జిల్లాలకు ఏమేం చేయబోతున్నామో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోంది!

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే బాధేస్తోంది. ప్రతిరోజూ పత్రికల్లో కిడ్నాప్, రేప్, కబ్జాల వార్తలే వస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కంపెనీలొస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఫాక్స్ కాన్ సంస్థను శ్రీసిటీలో ఏర్పాటు చేస్తే..దాన్ని కూడా సైకో సిఎం తెలంగాణకు తరిమారు. ఆ సంస్థ రెండో పెట్టుబడి కర్నాటకలో పెడుతోంది.  కంపెనీల వారిని ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బంది పెడుతోంది. ఇదా మనం కోరుకున్న రాష్ట్రం? చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఆచరణలో చేసి చూపించారు. అనంతకు కియా, చిత్తూరు సెల్ ఫోన్ కంపెనీ, నెల్లూరుకు హీరో, బర్జర్ పెయింట్ కంపెనీ తెచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫార్మా కంపెనీలు నెలకొల్పాం. విశాఖలో అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏర్పాటు చేశాం. కియా, ఫాక్స్ కాన్, టీసీఎల్, ఏషియన్ పేపర్ వంటి బడా కంపెనీలు అమరావతికి రాలేదు..ప్రైవేట్ కంపెనీలు అమరావతికి తీసుకురాలేదు.

ఆభివృద్ధి చేయడం అంత ఈజీకాదు

ఆరోపణలు చేయడం సులభం..పనులు చేయడం కష్టం. పోలవరంను కూడా 2021 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని చెప్పాడు..దాన్ని కూడా ఇప్పుడు 2025కు  పూర్తి చేస్తామని చెప్తున్నాడు. 175 నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా సరిగా చేశారా.? బటన్ నొక్కుతున్నా అంటాడు..నొక్కితే డబ్బులు పడటం లేదు. టీడీపీ వచ్చిన వెంటనే ఆపేసిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. జగన్ ఒకటి కట్టలేడు..కట్టేవాడికి అడ్డుపడతాడు..ఛాన్స్ ఇస్తే జేసీబీని పంపిస్తాడు. అమరావతి పనులు ఎక్కడైతే ఆగాయో..అక్కడి నుండే పనులు ప్రారంభిస్తాం.

కులం, మతం పేరుతో అమరావతిపై విషం

ఆనాడు అమరావతికి జై అన్న…నేడు కులం, మతం పేరుతో విషం కక్కుతున్నాడు. అయితే ఆయన మనస్థత్వం తెలిసిన వారీగా జగన్ గెలిస్తే రాజధాని ఇక్కడ ఉండదని ఆనాడే చెప్పాం. ఇప్పుడు మూడు ముక్కలాటాడుతున్నారు. ప్రపంచంలో వెనుకబడిన సౌతాఫ్రికా లాంటి దేశాన్ని జగన్ ఆదర్శంగా తీసుకున్నాడు.  ఆ దేశంలో 32 శాతం నిరుద్యోగిత ఉంది. 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాలి..మూడు రాజధానులన్న వ్యక్తి 3 ఇటుకలైనా వేశాడా? హైకోర్టు విషయానికి వస్తే కనీసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదు. ఇప్పుడు వైజాగ్ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది. వైసీపీ అధికారిక ట్విట్టర్ లో రిషికొండపై సచివాలయం కడుతున్నారని చెప్పిన 2గంటల్లోనే పోస్టు తొలగించారు. విశాఖ ప్రజలు కూడా మోసాన్ని గ్రహించాలి.

మహిళల కన్నీటితోనే సైకోసర్కారు భూస్థాపితం

అమరావతి మహిళల కన్నీల్లతోనే ఈ ప్రభుత్వం భూస్తాపితమవుతుంది.  మాటలకు ఆనాడు అందరూ మోసపోయారు. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట తప్పి, మడమతిప్పారు. రాజధాని మహిళలను జుట్టుపట్టుకుని ఈడ్చారు… బూటుకాళ్లతో తన్నారు, వెయ్యిమందిపై తప్పుడు కేసులు బనాయించారు.  నా జీవితంలో నేను మొదటిసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది అమరావతి రైతులకోసమే. ఇప్పుడు మార్పు ఇంటినుండే మొదలైంది. తల్లి, చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనను నమ్మడం లేదు… అమరావతి రైతుల త్యాగాలు వృధాగా పోవు.

మానవత్వంలేని ముఖ్యమంత్రి

భూములిచ్చిన వ్యక్తులను కొట్టాల్సిన అవసరం ఏంటి.? నోరు లేనివాళ్లను కొడతారా? జై అమరావతి అంటే కొట్టేవాళ్లు..కేసులు పెట్టేవాళ్లు. బాత్రూంపైకి కూడా డ్రోన్ కెమెరాలు పంపించారు. 2019కి ముందు బయటకు రాని మహిళలు బయటకు వచ్చారు. ఒక్క కేసు కూడా లేని వాళ్లపై వందల కేసులు బనాయించారు. 420 చుట్టూ 420లు, రౌడీ చుట్టూ రౌడీలే ఉంటారు. లక్షకోట్లు దోచుకున్న వ్యక్తి చుట్టూ ఎవరుంటారో ఆలోచించాలి. ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. రాజమండ్రిలో ఓ ఎంపీ ఉన్నాడు.. ఆయన ప్రోత్సాహంతోనే రాజమండ్రిలో అమరావతి రైతులపై దాడి జరిగింది. భరత్ కు తల్లీ, చెల్లి లేరా? ఎంపీగా గెలిచిన వ్యక్తే తల్లులను అవమానించి సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?

నేను కూడా సాధ్యం కాదనే అనుకున్నా

అమరావతి ఏర్పాటు, ప్రజల దగ్గర నుండి భూసేకరణ చేయాలంటే సాధ్యం కాదని నేనూ అనుకున్నా. చంద్రబాబుతో మాట్లాడినప్పుడు ..ఒక బిల్డింగ్ కట్టి వదిలేస్తే సైబరాబాద్ తయారయ్యేదా..హైదరాబాద్ మహానగరంగా మారేదా అన్నారు. వివాదాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడే భూ సమీకరణ జరగలేదు.అందరినీ ఒప్పించి భూమి తీసుకున్నారు. బెంగాల్ లో 600 ఎకరాల సమీకరణకు కాల్పులు జరిగాయి. రాజధానిలో ఎలా తిరుగుతావని ఎమ్మెల్యేనే బెదిరిస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని రైతులకు పెండింగ్ కౌలు చెల్లిస్తాం. 5 కోట్ల మంది ప్రలు అమరావతి రైతుల వెనక ఉన్నారు. ఇల్లు కట్టుకోలేదని జె-గ్యాంగ్ అవహేళన చేసినపుడు నేను చంద్రబాబును అడిగాను. రైతులకు న్యాయం చేసిన తర్వాతే భూమి కొందామని చంద్రబాబు చెప్పారు. అదీ ఆయనలో ఉన్న నిబద్ధత. నేను వేలాది ఎకరాలు కొన్నానని ప్రచారం చేశారు. నేను ఏనాడూ తప్పు చేయలేదు. సింగపూర్ ప్రభుత్వం స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చింది..వాళ్లను కూడా మెడబట్టి గెంటేశారు.

కరకట్ట కమల్ వాగ్దానాలు ఏమయ్యాయి?

కరకట్ట కమల్ హాసన్ కూడా మీటింగ్ లో..అమరావతికి ఎక్కడికీ పోదు..జగన్ తో నేను మాట్లాడతా అన్నాడు..కానీ అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా చప్పట్లు కొట్టారు. టీడీపీ వచ్చిన 3 నెలల్లో రిజర్వ్ జోన్ రద్దు చేస్తాం. కరకట్ట కమల్ హాసన్ గతంలో హామీ ఇచ్చారు..కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.  అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 41 మళ్లీ అమలు చేసి, అసైన్డ్ రైతులకు వెసలుబాటు కల్పిస్తాం. ప్రభుత్వాలు మారొచ్చు..కానీ విధానాలు మారకూడదు.

అమరావతి… ఏవిధంగా కమ్మరావతి?

అమరావతి ప్రజల రాజధాని. ఎక్కువ భాగం ఎస్సీ నియోజకవర్గంలో ఉంటుంది..6 ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో ఆర్డీఏ విస్తరించి ఉంది.  85 శాతం మంది రైతులకు 2 ఎకరాల లోపు భూమి ఉంది. రాజకీయ లబ్ధి కోసం కులం ముద్ర వేశాడు . మాస్టర్ ప్లాన్ పనులు అధికారంలోకి వచ్చాక చేపడతాం.  కులం ముద్ర వేసి అమరావతిని నాశనం చేశాడు. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు అంటూ చిచ్చు పెడుతున్నారు. ఆర్ – 3 జోన్ లో ఇళ్ల స్థలాలకు ఇచ్చే భూమి ఉన్నా..లిటిగేషన్ ఉన్న భూములను ఇవ్వాలని చూస్తున్నారు. కోర్టు కొట్టేయడంతో టీడీపీ పేదలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. రైతులకు పేదలకు మధ్య చిచ్చుపెడుతున్నారు. మంగళగిరి వాళ్లకు మంగళగిరిలో, తాడికొండ వాళ్లకు తాడికొండలోనే ఇళ్లు కట్టిస్తాం. ఆర్ – 3 జోన్ లో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. తాడికొండ, మంగళగిరిలో గెలిచేందుకు ఇళ్ల స్థలాలంటూ డ్రామాలాడుతున్నాడు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే చిచ్చు పెట్టి లాభంపొందాలని చూస్తున్నారు. నిజంగా వైసీపీ పేదలపై ప్రేమ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 52నెలల్లో కేవలం 6 వేల ఇళ్లు మాత్రమే కడతారా?

దళితులపైనే అట్రాసిటీ కేసులా

కృష్ణాయపాలెంకు చెందిన దళిత రైతులపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారు..మేము పోరాడి బయటకు తీసుకొచ్చాం. తప్పుడు కేసులు పెట్టిన డీఎస్పీకి పోస్టింగ్ కూడా రాలేదు. అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు పెట్టిన వారిపై జ్యుడిషియల్ విచారణ వేస్తాం. ఉద్యమ సమయంలో ఫోటోలు తీసిన వారిపైనా కేసులు పెట్టారు. జేఏసీలో పోరాడిన వారిపైనా కేసులు పెట్టి, ట్రోల్ చేశారు. చంద్రబాబు కంటే వయసులో చిన్నోడు..చంద్రబాబు సభలో దండం పెట్టినా వినకుండా ఎగతాలి చేశారు. నేను కూడా దండం పెట్టి చెప్పా..రాష్ట్రం నష్టోతుందని అంటే సన్నబియ్యం సన్నాసి కూడా నా తల్లిపై, నాపై కామెంట్లు చేశాడు.

3రాజధానులని ఆనాడే ఎందుకు చెప్పలేదు

అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశాడు. ప్రజావేదికను కూల్చివేతతో పాలన ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ శిధిలాలు తొలగించలేదు. ప్రమాణస్వీకారం చేసిన మొదటి వారం నుండే ఈ సీఎం విధ్వంసం ప్రారంభమైంది.  ఇది అమరావతి ఆవేదన కాదు..ఆంధ్రప్రదేశ్ ఆక్రందన. రాష్ట్ర నడిబొడ్డున అమరావతి ఉంది. 30 వేల ఎకరాలు రాజధానికి కావాలని ఆనాడు జగన్ అన్నాడు. రాజధానిగా అన్ని అర్హతలున్నాయి అమరావతికి.  రెండు కిలోమీటర్ల రోడ్డు వేయలేనివాడు 3రాజధానులు కడతాడా? విశాఖలో 3 ఇటుకలు వేయలేదు..రిషికొండకు గుండుమాత్రం కొట్టించారు. కర్నూలులో హైకోర్టు నిర్మించేందుకు భూమి కూడా సేకరించలేదు.

సమావేశంలో అమరావతి రైతుల ఆవేదనలు

1.            పద్మ : రాజధాని లేదని భూములిచ్చాం..మా భూముల్లో రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు..ఈ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకించాం. ఉద్యమం చేసే సమయంలో దుర్గ గుడికి మొక్కలు చెల్లించుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎవడివ్వమన్నారే భూములు అని పోలీసులు మాట్లాడారు. కడుపు నిండా అన్నం తిని, కండి నిండ నిద్రపోయి నాలుగేళ్లు అయింది. లం…ముండల్లారా అని దుర్భాషలాడి రోడ్డుపై ఈడ్చారు. పెయిడ్ ఆర్టిస్టులని మమ్మల్ని అవమానించారు. రాష్ట్రం కోసమే భూములిచ్చాం..మా బాధలు చెప్పుకోవడానికి బయటకు వస్తే కొట్టారు. మా పిల్లల్ని కూడా ఇష్టానుసారంగా కొట్టి కేసులు పెట్టారు. మేమేమన్నా నక్సలైట్లమా..దొంగలమా.? మేము చేసిన తప్పు భూములివ్వడమా.? డొక్కల్లో తన్నారు..కాళ్లు పట్టుకుంటామన్నా వదల్లేదు. చేతులు వెనక్కి విరిచారు..నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నా.

2.            తాతినేని రాజేశ్వరి : మేము 4 ఎకరాలు భూమిచ్చాం. అరసవెల్లి పాదయాత్రకు వెళ్తుంటే మమ్మల్ని కొట్టేందుకు వైసీపీ నేతలు రాజమండ్రిలో రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారు. అయినా తగ్గకుండా వెళ్తుంటే కొట్టారు.

3.            భూక్యా నాయక్ : నేను అరఎకరా పొలం ఇచ్చాం. మీరు బిర్యానీకి అమ్ముడుపోతున్నారని అన్నారు. తెల్లవారుజామున నన్ను తీసుకెళ్లారు. నోరు లేని మా అబ్బాయిని బూటు కాళ్లతో తొక్కారు. తెనాలి తీసుకెల్లి..మంగళగిరి తీసుకొచ్చారు. మేము ఏం పాపం చేశాం. పనిచేసుకుని బతికే వాళ్లం..ఎన్నో విధాలుగా హింసలు పెట్టారు. ఇంట్లో ఆడమనిషి బాధతో ఉందన్నా వినకుండా పోలీసులు తీసుకెళ్లారు.

4.            జగన్మోహన్, వెలగపూడి : నేను 4 ఎకరాలు భూమి ఇచ్చాను. నన్ను డీఎస్పీ కిందకు వేలదీశారు..చెయ్యి విరిగింది. శరత్ బాబు అనే సీఐ రోజుకో కేసు లెక్కన 25 కేసులు పెట్టారు. ఆలోచించి పెట్టండంటే..నువ్వెవరు ఆలోచించమని చెప్పడానికి అన్నారు. వారానికి 4 రోజులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నా. నిరుడు నుండి కౌలు ఇవ్వడం లేదు. పని చేసుకోకపోతే కుటుంబం జరగదు. ఆనాడు వచ్చి చెప్పిన కలెక్టర్లు, ఆర్డీవోలు ఏమయ్యారు. నా భార్య సరిగా అన్నం కూడా తినడం లేదు. మాకెందుకు ఈ కష్టాలు.? జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఆర్డీవోలు ఏమయ్యారు..వాళ్లేమైనా శవాలయ్యారా.? మాకు సమాధానం లోకేష్ ఒక్కడే ఎందుకు చెప్పాలి.? మా సొమ్ముతో అధికారులు జీతాలు తీసుకుంటున్నారు. మమ్మల్ని జైల్లో వేయడమే పోలీసులకు ఉద్యోగమా.? డొక్కల్లో తన్ని, చేతులు విరగ్గొట్టి, మహిళల్ని ఇష్టానుసారంగా దూషించారు. రైతులకు కౌలు ఎందుకు ఇవ్వడం లేదు..మీ జేబులోవి ఇస్తున్నారా.? మేము కంపలెమ్మటి గడ్డి తినాలా.?

5.            మేకా శ్రీధర్ రెడ్డి, తాడేపల్లి : మాస్టర్ ప్లాన్ లో భాగంగా తాడేపల్లిలో 178 ఎకరాలు రిజర్వ్ జోన్ అని పెట్టారు. దీంతో మేము భూమి అమ్ముకోవడానికి, కొనడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వం తొలగిస్తామని చెప్పినా తొలగించలేదు. మీరొచ్చాక రిజర్వ్ జోన్ నుండి తొలగిస్తారా.?

6.            అంకం స్వర్ణ కమల : నాకు 70 సెంట్ల అసైన్డ్ భూమిని రాజధానికి ఇచ్చాను. రాష్ట్ర ప్రయోజనం కోసం మేమిచ్చాం. అసైన్డ్ రైతులకు కౌలు కూడా ఇవ్వడం లేదు. 41జీవోతో గత ప్రభుత్వం అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అవకాశం కల్పించింది. 316 జీవోతో ఈ ప్రభుత్వం ఉరితీసింది. అసైన్డ్ రైతులకు కూడా సాధారణ రైతులతో సమానంగా కౌలు చెల్లిస్తాం అన్నారు. పిల్లన్ని చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇది కమ్మరాజధాని కాదు..మా దళితుల రాజధాని. 316 జీవో రద్దు చేసి..41 జీవో తీసుకురావాలి.

7.            షేక్.సాహెబ్ జాన్ : రాజధానిలో ఒకే కులం ఉందని మొరిగేవాళ్లకు ఒకే సవాల్ చేస్తున్నాం..కోర్ కేపిటల్ పరిధిలో ముస్లింలు ఉన్నారు. రాజధాని కోసం నా ఎకరాలో నిమ్మతోట ఉన్నా ఇచ్చాను. ఆదాయం లేదు..బతుకుదెరువు కోసం చిన్న వ్యాపారం పెట్టుకున్నా. జగన్ వచ్చాక వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. మాకు ఉపాధి లేదు. ఫీజులు కట్టుకోవడానికి కూడా కౌలు ఇవ్వడం లేదు. మేము భూములు ఇస్తేనే సీఆర్డీఏ అధికారులకు ఉద్యోగాలొచ్చాయి. రాజధాని రైతులకు కూడా రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలి.

8.            నరసింహారావు, మాజీ సర్పంచ్, తుళ్లూరు : అమరావతిని కమ్మరావతి అని పిలుస్తుంటే మాకు బాధేస్తోంది. రాజధానిలో అన్ని జాతులు, వర్గాలున్నాయి. నేను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని. మనసు క్షోభించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నాకున్న 3 ఎకరాలు రాజధానికి ఇచ్చాను. మాకు ప్లాట్లు ఇవ్వలేదు..రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎవరి సొమ్మని మా బూములు ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారు..మేము పేదలకు వ్యతిరేకం కాదు. ఏ ఊర్లో వారికి అక్కడే స్థలాలివ్వాలి. 17 వందల ఎకరాల్లో పేదలకు ఇల్లు కట్టించేందుకు రాజధానిలో ఆర్ -3 జోన్ లో కేటాయించారు. ఎక్కడో ఉన్నవారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు..ప్రభుత్వం కొని 5 సెంట్లు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఆర్  -5 ను సృష్టించింది అమరావతి వినాశనానికే.

9.            గడ్డం మార్టిన్ లూధర్, మందడం : మాకు రావాల్సిన అసైన్డ్ కౌలు నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. మరో ప్రాంతం వారిని ఇక్కడికి తెచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారు..ఎక్కడికి వస్తున్నారని మా దళిత రైతులు అడిగితే అరెస్టు చేసి నరసరావుపేట జైలుకు తీసుకెళ్లి, అక్కడి నుండి గంటూరుకు తీసుకొచ్చారు. పేదలకు ఇక్కడ స్థలాలిస్తామని ఒక్కొక్కరి నుండి రూ.50 వేలు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్ కు కూడా వారి నుండే వసూలు చేశారు. రూ.12 కోట్లు ఖర్చు పెట్టి 12 కి.మీలకు హెలికాప్టర్ లో జగన్ వచ్చారు..అతని దుబారా ఖర్చుపై విచారణ చేయాలి. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని రాజధానిని జగన్ నాశనం చేశాడు.

10.          చిలకా బసవయ్య, రాయపూడి : నాకున్న అసైన్డ్ భూమి 35 సెంట్లను రాజధానికి ఇచ్చాను. 4 ఏళ్లుగా అసైన్డ్ రైతులకు కౌలు ఇవ్వడం లేదు. రాజధానిలో 3,135 మంది అసైన్డ్ రైతులు ఉన్నారు. సిట్, సీఐడీ అంటూ వేధించారు. రైతు కూలీలకు గతంలో నెలకు రూ.2,500 పెన్షన్ ఇచ్చారు..కానీ వారికి కూడా పెన్షన్ సరిగా ఇవ్వడం లేదు. మేము పాదయాత్ర చేస్తుంటే మా మహిళలపై నిందలు వేశారు. అరసవెళ్లి వెస్తుంటే వైసీపీ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. పట్టు చీరలు కట్టుకుంటున్నారని మా భార్యలను అవమానించారు. కరకట్ట రోడ్డు విస్తరణ చేపడతానని 2 ఏళ్ల కిందట శంకుస్థాపన చేశాడు..ఇప్పటికీ సెంటు కూడా భూమి సేకరించలేదు. రాజధానిలో 5 శాతం భూమి పేదలకు ఇళ్లు కట్టేందుకు కేటాయించారు. కబ్జా చేసేందుకు వైసీపీ నేతల ముందుంటారు.

11.          శ్రీనివాసరెడ్డి: అమరావతిలో ఎస్సీల భూములు 32 శాతం, రెడ్లవి 23 శాతం, కమ్మలవి 18 శాతం, కాపులవి 9 శాతం భూములు ఉన్నాయి. మానసిక రోగులు మాత్రం అమరావతిని కమ్మరావతి అని మాట్లాడుతున్నారు. అమరావతి ఆంధ్రుల రాజధాని. రైతులకు కౌలు ఇవ్వడం లేదు..ఏం తిని బతకాలి.? సీడ్ యాక్సెస్ రోడ్డు 2కి.మీ ఆగిపోయింది..దాన్ని 4 ఏళ్లుగా పూర్తి చేయడం లేదు. పెదపరిమి గ్రామంలో 700 ఎకరాలు రాజధానికి ఇచ్చారు..అందులో 600 ఎకరాలు రెడ్లకు చెందినదే.

నారా లోకేష్ ను కలిసిన వరగాని దళితులు

తాడికొండ నియోజకవర్గం వరగాని గ్రామస్తులు నారా లోకేష్ కలిసి వినతిపత్ర్రం అందించారు. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద మా గ్రామానికి రూ.రూ.1.30 కోట్లు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ నిధులను నిలిపేసింది. వరగాని నుండి రావెల గ్రామాల మధ్య రోడ్డును గత ప్రభుత్వం మంజూరు చేసినా..ఈ ప్రభుత్వ రాగానే రద్దు చేసింది. గత ప్రభుత్వంలో గ్రామంలో మంచినీటి చెరువులు, వాటర్ ట్యాంక్ లు నిర్మించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మంచినీటి చెరువులకు ఫెన్సింగ్ నిర్మించలేదు. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

*నారా లోకేష్ మాట్లాడుతూ…*

అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. ఎస్సీల కోసం గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసి తీరని అన్యాయం చేశాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది. గత ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దళితవాడలనుంచే శ్రీకారం చుట్టారు.  టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. టీడీపీ వచ్చాక వరగాని నుండి రావెలకు రోడ్డు నిర్మిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన రావెల గ్రామస్తులు

తాడికొండ నియోజకవర్గం రావెల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రావెల, బేజాత్ పురం, పాములపాడు, నెమలికల్లు గ్రామాల వ్యవసాయ భూములు నాగార్జున సాగర్ ఆయకట్టుకు చివరి భాగంలో ఉండటం వల్ల సాగునీరు అందడం లేదు. రావెల గ్రామం వద్ద కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మించి బేజాత్ పురం తారురోడ్డు వద్దగల సాగర్ కెనాల్లో నీటిని పంపు చేస్తే నాలుగు గ్రామాల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మా గ్రామంలో సుమారు 8 వేల మంది జనాభా ఉన్నారు. రక్షిత మంచినీటి పథకం రిజర్వాయర్ కెపాసిటీ సరిపోవడం లేదు.  సాగర్ కెనాల్ ఆనుకుని మా గ్రామానికి సంబంధించిన సుమారు 17 ఎకరాల్లో ఏరువ వారి చెరువు కలదు. దాన్ని శుభ్రపరిచి పంపింగ్ సిస్టం  ద్వారా మంచినీటిని రిజర్వాయర్లో నింపితే నీటి సమస్య తీరుతుంది. రావెల గ్రామం నుండి వరగాని తారురోడ్డు పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం రోడ్డును మంజూరు చేసింది..కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దైంది. మీ ప్రభుత్వం వచ్చాక రోడ్డు నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రాజెక్టుల మాట దేవుడెరుగు, గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రాజ్యమేలుతున్నాడు. వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం రూ68,194 కోట్లు ఖర్చుచేయగా, వైసీపీ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి, చివరి భూములకు నీరందిస్తాం. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం ఇచ్చే జల్ జీవన్ మిషన్ నిధులు ఖర్చు చేయడంలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి ద్వారా 24/7 స్వచ్ఛమైన నీటిని అందిస్తాం. రావెల నుండి వరగాని తారురోడ్డు నిర్మించి ఇబ్బందులను తొలగిస్తాం.

Also Read this Blog: Footprints of Progress: Naralokesh’s Padayatra Impact

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *