Naralokesh padayatra,yuvagalam
Naralokesh padayatra,yuvagalam

వినుకొండ నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! గ్రామగ్రామాన యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం

మాచర్ల నియోజకవర్గంలో లోకేష్ కు అపూర్వస్వాగతం

వినుకొండ: పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ నియోజకవర్గంలో 5రోజులపాటు దుమ్మురేపింది. గ్రామగ్రామాన ప్రజలు యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతించి బ్రహ్మరథం పట్టారు. ఆదివారం నాడు జయంతిరామపురం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. గుక్కుడునీటికోసం ఇబ్బంది పడుతున్నామంటూ వివిధ గ్రామాల ప్రజలు యువనేత ఎదుట మొరపెట్టుకున్నారు. మరికొద్దినెలలు ఓపికపట్టాలని, మీ అందరి ఆశీస్సులతో రాబోయే చంద్రన్న ప్రభుత్వం పల్నాడులో తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. జయంతిరామపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేళ్లవాగు, రెడ్డిపాలెంమీదుగా శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాచర్ల ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. పల్నాడు పౌరుషానికి గుర్తుగా మిర్చితో తయారుచేసిన గజమాలతో యువనేతకు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలు, జై లోకేష్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. దారిపొడవునా మాచర్ల ప్రజలు, మహిళలు యువనేతను ఆప్యాయంగా స్వాగతించారు. యువనేతను కలిసి కష్టాలు చెప్పుకునేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం యువనేత పాదయాత్ర కారంపూడి శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 176వరోజు యువనేత లోకేష్ 10.7 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2343.4 కి.మీ.ల మేర పూర్తయింది. ఇదిలావుండగా కారంపూడి వీర్లగుడి సెంటర్ లో సోమవారం సాయంత్రం నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు. పల్నాడులో అత్యంత కీలకమైన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాల్గొనే బహిరంగసభపై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

గొంతుతడుపుకోవడానికి కూడా నీళ్లులేవు-వెంకటనారాయణ, గరికపాడు, బొల్లాపల్లి మండలం.

నాకు 20ఎకరాల పొలం ఉంది. గత ఏడాది పత్తి, మిర్చి, పొగాకు సాగుచేస్తే రూ.10లక్షల నష్టం వచ్చింది. 1.65లక్షలు ఖర్చుపెట్టి 1250 అడుగులలోతున బోర్లువేసినా నీళ్లు పడలేదు. మా గ్రామంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. గతంలో ట్యాంకర్లద్వారా తాగునీళ్లు ఇచ్చేవారు, గత నాలుగేళ్లుగా తీవ్రఇబ్బందులు పడుతున్నాం. దాహార్తి తీర్చుకునేందుకు ఎద్దులబండ్లపై దూరప్రాంతాలకు వెళ్లి బ్యారల్ రూ.500 పెట్టి నీళ్లు తెచ్చుకుంటున్నాం. మా నీటికష్టాలు తీర్చే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం.

గిరిజన తాండాలను పట్టించుకోవడం లేదు-ఏడుకొండలు నాయక్, కాంతానాయక్, హనుమాపురం.

బొల్లాపల్లి మండలంలో మొత్తం 32 గిరిజన తాండాలు ఉన్నాయి. మాకు తాగు, సాగునీటి సౌకర్యం లేదు. పత్తి,మిర్చి పంటలు వేయగా నల్లి తెగులు కారణంగా నష్టపోయాం. వర్షాధారంగా వ్యవసాయం చేస్తుండటంతో ఏటికేడు నష్టాలు తప్ప లాభం లేదు. మా బిడ్డలు చదువుకోవడానికి దగ్గర్లో రెసిడెన్షియల్ స్కూళ్లు లేవు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీళ్లిస్తే తప్ప మా బతుకులు బాగుపడే పరిస్థితులు లేవు. ఆ పథకం ఏర్పాటుచేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. పేదరైతులమైన మాకు ప్రభుత్వం బోర్లు తవ్విస్తే మాకు వెసలుబాటుగా ఉంటుంది.

వ్యవసాయం చేయాలంటే భయమేస్తోంది-బారెడ్డి వెంకటపుల్లారెడ్డి, రేమిడిచర్ల

నేను 6ఎకరాల్లో మిర్చి, పత్తి సాగుచేశాను. పెట్టుబడి, కూలీ ఖర్చులు కలిపి రూ.2లక్షల నష్టం వచ్చింది. గతంతో పోలిస్తే ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి. డిఎపి కట్ట 2వేలు అయింది. బేయర్ వారి 100 ఎంఎల్ పురుగుమందు 3వేలు పలుకుతోంది. ఈ రేట్లతో వ్యవసాయం చేయాలంటే భయమేస్తోంది. నాకు టెన్త్, ఇంటర్ చదివే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వ్యవసాయంలో నష్టాలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బతుకుబండి లాగడం కష్టంగా ఉంది.

సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయాలని ఉంది-బి.శివకుమార్, ఇర్లపాడు

నేను ఎంఎస్సీ చదువుకొని హైదరాబాద్ లోని డబ్ల్యుఎన్ఎస్ అనే ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య కూడా అక్కడ హెచ్ఆర్ గా జాబ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. మా గ్రామానికి చెందిన మరికొందరు కూడా పొరుగురాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఎపిలో ఐటి కంపెనీలు వస్తాయని నమ్ముతున్నాను. అప్పుడు మాలాంటి వారికి సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభించే అవకాశాలు వస్తాయి.

నారా లోకేష్ ను కలిసిన జయంతిరామపురం గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం జయంతి రామపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి వ్యవసాయమే జీవనాధారం. గ్రామంలో రైతులంతా భూగర్భజలాలపైనే ఆధారపడుతున్నాం. కొన్నేళ్లుగా భూగర్బజలాలు కూడా తగ్గిపోవడంతో రైతులం ఇబ్బంది పడుతున్నాం.  ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం కావడంతో తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలి. గతంలో పేద రైతులకు మంజూరు చేసిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. చుక్కల భూములను క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రజలకు గుక్కెడు నీళ్లందించలేని దివాలాకోరు ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. జల్ జీవన్ మిషన్ అమలులో మన రాష్ట్రాన్ని 18వ స్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. దీర్ఘకాలంగా అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పిస్తాం. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

నారా లోకేష్ ను కలిసిన మేళ్లవాగు గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం మేళ్లవాగు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. తండాలకు రవాణా సౌకర్యం లేక చదువుపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 20 కి.మీ దూరంలో ఉన్న బొల్లాపల్లికి వెళ్లడానికి అనాసక్తితో ఉన్నారు. మా గ్రామంలో బాలబాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లైతే చట్టుపక్క గ్రామాల్లోని విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతుంది. వసతి గృహాలకు తగినంత స్థలం కూడా అందుబాటులో ఉన్నందును వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. మా గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేనందున బోరుబావులపై ఆధారపడాల్సి వస్తోంది. వెయ్యి అడుగుల లోతులో భూగర్భ జలాలు తగులుతున్నాయి. ఎక్కువ లోతులో ఉన్నందును పంట పొలాలకు సరిపడా నీరు అందడంలేదు. ఆర్థిక నష్టాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  మా గ్రామానికి 8 కి.మీ దూరంలో ఉన్న ఎన్ఎస్పీ కాల్వ ద్వారా గ్రామాల్లోని చెరువులకు పైపులైన్ల ద్వారా నీటిని నింపితే మమ్మల్ని కాపాడినవారవుతారు. అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

స్కూళ్ల విలీనం పేరుతో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 4లక్షల మంది గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన తాండాల్లో ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది. అధికారంలోకి వచ్చాక వినుకొండ గిరిజన తాండాల విద్యార్థులకోసం రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుచేస్తాం. వ్యవసాయంపై అవగాహన లేని సిఎం కారణంగా రైతుల ఆత్మహత్యల్లో ఎపి దేశంలో 3వస్థానంలో నిలచింది. ఎన్ ఎస్ పి కాల్వ ఆధునీకరణ చేపట్టి కాల్వ చివరి భూములకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపట్టి బొల్లాపల్లి మండలం తాగు, సాగునీటి సమస్యను TDP శాశ్వతంగా పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన రెడ్డిపాలెం గ్రామస్తులు

వినుకొండ నియోజకవర్గం రెడ్డిపాలెం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మా ప్రాంతంలో మిర్చి, పొగాకు, పత్తి పంటలు ఎక్కువగా సాగు చేస్తాం. ఈ పంటలు పండించేందుకు సాగునీటి సౌకర్యం లేదు. మా గ్రామంలోని లక్ష్మమ్మ చెరువు, గుర్రప్ప చెరువును 8 కి.మీ దూరంలో ఉన్న కారంపూడి ఎన్ఎస్పీ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపాలి. దీంతో దాదాపు 300 ఎకరాల సాగుభూమికి నీరందుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

గత టిడిపి ప్రభుత్వంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్ననీటి వనరుల అభివృద్ధికి రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా. సాగర్ కాల్వల ఆధునీకరణ, వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మమ్మ, గుర్రప్పు చెరువులతోపాటు బొల్లాపల్లి మండలంలో తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కారంపూడి విద్యార్థులు

మాచర్ల నియోజకవర్గం శ్రీచక్ర సిమెంటు ఫ్యాక్టరీ వద్ద కారంపూడి విద్యార్థులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కారంపూడి మండలంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలున్నాయి. మేము ఇంటర్, డిగ్రీ చదవాలంటే నరసరావుపేట, గుంటూరు వెళ్లి హాస్టళ్లలో ఉండి చదవాల్సి వస్తోంది. మావి వ్యవసాయం కూలీ కుంటుంబాలు కావడం వల్ల పెద్దమొత్తంలో ఖర్చు పెట్టడానికి ఆర్థికస్థోమత సరిపోవడం లేదు. బొల్లాపల్లి మండలానికి చెందిన 15 గ్రామాలు కారంపూడికి దగ్గరగా ఉన్నాయి.  మీ ప్రభుత్వం వచ్చాక కారంపూడిలో ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయగలిగితే బలహీనవర్గాలకు మేలు చేసినవారవుతారు.

నారా లోకేష్ మాట్లాడుతూ

అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవిద్యార్థులకు గతంలో అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారు. కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తాం… విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీకాలేజి అంశాన్ని పరిశీలిస్తాం. గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తాం.

Also Read this Blog:Footsteps of Change: Naralokesh’s Padayatra for Progress

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *