Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

పెదకూరపాడు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం గ్రామగ్రామాన యువనేతకు ఆత్మీక స్వాగతం

తాడికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

పెదకూరపాడు: పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3రోజులపాటు హోరెత్తిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. 182వరోజు యువనేత Nara Lokesh పాదయాత్ర గారపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా గ్రామగ్రామాన ప్రజలు నీరాజనాలు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో యువగళం పాదయాత్ర జాతరను తలపించింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు నాలుగేళ్ల అరాచకపాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువనేతకు చెప్పకున్నారు. మరో తొమ్మిదనెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నివర్గాలకు బాసటగా నిలుస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. పెదకూరపాడులో దళితులతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. గారపాడు నుంచి ప్రారంభమైన యువనేత లోకేష్ పాదయాత్ర లగడపాడు, పెదకూరపాడు, లింగంగుంట్ల, పొడపాడు మీదగా సిరిపురం శివార్లలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సిరిపురం శివార్లలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో యువనేతకు తాడికొండ ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్వాగతద్వారాలు, గజమాలలు, బాణాసంచా మోతలతో యువనేతను స్వాగతించారు. 182వరోజు యువనేత లోకేష్ 21.9 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళ పాదయాత్ర 2441.9 కి.మీ.ల మేర పూర్తయింది. ఆదివారం నాడు యువనేత లోకేష్ తాడికొండ నియోజకవర్గం రావెలలో అమరావతి రైతులతో ముఖాముఖి సమావేశమై వారి కష్టాలను తెలుసుకోనున్నారు.

అందుకే దళితమంత్రిని మోకాళ్లపై నిలబెట్టారుఆంధ్రులు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం పాలనలో అత్యధికంగా నష్టపోయింది దళితులే దళితులపై పెట్టిన తప్పుడు కేసులన్నీ రద్దుచేస్తాం

దళితులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

పెదకూరపాడు: ముఖ్యమంత్రి కు దళితులకు కనీస గౌరవం ఇచ్చే మనస్సు లేదు,  మంత్రి పినిపే విశ్వరూప్ మోకాళ్ళపై  కూర్చోబెట్టారు, ఇంకో మంత్రి నారాయణ స్వామిని కూడా గతంలో వేదికపై నిలబెట్టి అవమానించారు,  అదీ దళితులకు ఇచ్చే గౌరవమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…  దళిత ద్రోహి విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తొలగించాడు. దళితులకు గత ప్రభుత్వం 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు, ప్రశ్నించిన దళితులను కిరాతకంగా చంపేసాడు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపేశారు. తాడిపత్రి సీఐ ఆనందరావుని తప్పుడు కేసులు పెట్టలేదని వేధించి చంపేశారు.  నాసిరకం మద్యంపై ప్రశ్నించిన దళితయువకుడు ఓం ప్రతాప్ ని పుంగనూరు లో పాపాల పెద్దిరెడ్డి చంపేసాడు. దళితులను చంపేస్తుంటే సంఘాలు భయపడి మాట్లాడటం లేదు. దళిత రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దళిత రైతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.

అమరావతిలో పనులు ప్రారంభిస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా ప్రజారాజధాని అమరావతి నిర్మిస్తాం. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని అమరావతి. అభివృద్ది వికేంద్రీకరణ మా నినాదం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ప్రకటించింది.  అందుకే అభివృద్ది జరగకూడదు. అందరూ నా కింద బ్రతకాలి అని అనుకుంటాడుతొలగించిన వారిని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలగించిన వారిని తిరిగి ఉద్యోగం లో చేర్చుకుంటాం.

దళితులపై అక్రమ కేసులన్నీ రద్దుచేస్తాం!

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దళితుల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజకీయాల కోసం దళిత యువకుల భవిష్యత్తు దెబ్బతీస్తున్నాడు. సొంత బాబాయ్ ని లేపేసిన వాడు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు.. ఏపిలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు… రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అక్రమంగా పెట్టిన కేసులు అన్ని తొలగిస్తాం.

దళితులకోసం నేను జైలుకు వెళ్లా!

అమరావతి దళిత రైతుల తరపున పోరాటం చేసినందుకు మొదటిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. దళిత యువతి రమ్యని హత్య చేసినప్పుడు నేను పోరాడినందుకు నేను రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం ని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి వైసిపి నేతలు సన్మానాలు చేస్తున్నారు. టిడిపి హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. దళిత వాడల్లో సిసి రోడ్లు వేసాం. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లు, డ్రైనేజ్, ఇలా అన్ని అభివృద్ది కార్యక్రమాలు దళిత కాలనీల నుండే ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నా. అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పథకం తీసుకొచ్చి దళిత యువత ఉన్నత విద్య చదువుకి సాయం అందించాం. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాం. 2.70 లక్షల మంది దళితులకు స్వయం ఉపాధి కల్పించాం. ఇన్నోవాలు, జేసిబిలు, వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందించాం.

సిగ్గుంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి!

శాండ్ శంకర్ కి సిగ్గుంటే రాజీనామా చెయ్యాలి. అమ్మ లాంటి అమరావతి ని చంపేస్తుంటే చప్పట్లు కొట్టాడు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500… హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000 వేలు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు తింటున్నారు. ఇసుక లో జగన్ కి రోజు ఆదాయం రూ.3 కోట్లు. టిడిపి హయాంలో సబ్సిడీలో రుణాలు ఇచ్చి జేసిబిలు, ఇన్నోవాలు ఇవ్వడమే కాకుండా పని కూడా కల్పించాం. ఇప్పుడు జగన్ వలన అన్ని ఆగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడమే కాకుండా పని కూడా కల్పిస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించడం కోసం మాత్రమే ప్రభుత్వం వినియోగిస్తుంది. అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. తప్పిపోయిన చిన్న పాప గురించి పట్టించుకునే వారు లేకపోవడం బాధాకరం. పాపతండ్రి రమేష్ తరపున నేను పోరాడతాను.

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ…

దళితులకు టిడిపి హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసాం. అమరావతి రాజధాని అయితే ఇక్కడ ఎస్సీలు బాగుపడతారు అని అనేక కలలు కన్నాను. దళితులకు టిడిపి హయాంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని పథకాలు  రద్దు చేసాడు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించాడు. టిడిపి హయాంలో ఎస్సీ కాలనీలను అభివృద్ది చేసాం.

ముఖాముఖిలో దళితులు మాట్లాడుతూ…

గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు. విదేశీ విద్య పథకం రద్దు చేయడం వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్య కు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు.  టిడిపి హయాంలో సబ్సిడీ లో జేసిబీలు, ఇన్నోవాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి. తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు కన్నీరు పెట్టుకున్న దళితుడు రమేష్. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాల కి వెళ్లి పనులు చేసుకుంటున్నాం. దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. చదువుకన్నా ఉద్యోగాలు రావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు. దళితుల్ని జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుంది.

నారా లోకేష్ ను కలిసిన గారపాడు గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం  గారపాడు గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. గ్రామంలోని సాగర్ ఆయకట్టు చివరి పొలాలకు నీరు అందడం లేదు. చివరి భూములకు నీరందే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి. మురుగునీరు పారేందుకు సైడు కాల్వలు లేవు. గ్రామంలో భూమి లభ్యత ఉంది..మీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఇంటింటికీ మంచినీరు అందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే TDP లక్ష్యం. రైతులకు మేలు చేకూర్చడంలో రాజీపడం. ఐదేళ్లలో టిడిపి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,194 కోట్లు ఖర్చుచేస్తే..వైసీపీ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు ఖర్చు చేసింది. సాగర్ ఆయకట్టు చివరి పొలాలకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటాం.  ప్యాలెస్ లపై శ్రద్ధ..గ్రామాభివృద్ధిపై సైకో జగన్ పెట్టలేదు. టీడీపీ వచ్చిన వెంటనే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతాం. ఇంటింటికీ మంచినీటి కోసం కేంద్రం నిధులు ఇచ్చినా వినియోగించుకోలేని దద్దమ్మ సీఎం జగన్. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఇంటింటికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు అందిస్తాం. ప్యాక్షన్ పాలకులకు రక్తం పారించడం తెలుసు..విజనరీ లీడర్ కు ఉద్యోగాలివ్వడమే తెలుసు. ఐదేళ్లలో 40 వేల పరిశ్రమల ద్వారా 6 లక్షల ఉద్యోగాలిచ్చాం.  పల్నాడుకు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పెదకూరపాడు రైతులు

పెదకూరపాడు జంక్షన్ లో రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల మాఫియా రైతులపై దాడి చేస్తోంది. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నా మండలంలోని 20 గ్రామాల్లో 15 గ్రామాలకు సాగర్ కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. వర్షం పడితే పొలాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సబ్సీడీలు పూర్తిగా తొలగించింది.  యంత్రాలు, టార్ఫాలిన్ పట్ఠలు, మైక్రో ఇరిగేషన్ ను పూర్తిగా రద్దు చేయడంతో సొంత డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. `వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి ధరలు ఉండటం లేదు. మండలంలో కోల్డ్ స్టోరేజీ, సాధారణ గిడ్డంగి ఉంటే రైతులకు మేలు జరుగుతుంది.

నారా లోకేష్ మాట్లాడుతూ

లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా దేశం మొత్తమ్మీద ఎపి రైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉన్నారు. రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలు మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరాచేస్తాం. గత ప్రభుత్వంలో రైతులకు అమలుచేసిన రాయితీలన్నీ పునరుద్దరిస్తాం. కోల్డ్ స్టోరేజిల నిర్మాణానికి సబ్సిడీలు అందజేసి ప్రోత్సహిస్తాం.

లోకేష్ ను కలిసిన ముస్లిం సామాజకవర్గీయులు

పెదకూరపాడు నియోజకవర్గ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చాక అరికట్టాలి. ఎస్సీల మాదిరిగా ముస్లింలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకూ సబ్సడీ రుణాలివ్వాలి.  ముస్లింలకు సబ్ ప్లాన్ నిధులను ముస్లింలకు మాత్రమే ఖర్చుచేయాలి. నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. చదువు మధ్యలోనే నిలిపేసిన పేద ముస్లిం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ద్వారా ఉపాధి కల్పించాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి..వాటిని రక్షించాలి. మదరసాలో అరబ్బీ చదువుకుని ఆఫీస్, ఆలిమ్ కోర్సులు అయిన వారికి ప్రభుత్వ ఉర్దూ టీచర్లుగా ఉద్యోగాలు కల్పించాలి. యూనిఫామ్ కోడ్ గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. దుల్హన్ పథకానికి టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తే..ఈ ప్రభుత్వం లక్ష ఇస్తామని చెప్పింది. కానీ ఆంక్షలు విధించడం వల్ల పేద ముస్లింలకు అందడంలేదు.  ముస్లింలపై నమోదైన అక్రమ కేసులు మాఫీ చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ఎన్నికల సమయంలో ఓట్లకోసం కల్లబొల్లి కబుర్లుచెప్పి అధికారంలోకి వచ్చాక ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. గత నాలుగేళ్లుగా వైసిపి ప్రభుత్వం ముస్లింలను ఊచకోత కోస్తోంది. అబ్దుల్ సలాం, మిస్బా ఆత్మహత్యల్లో ప్రమేయమున్నవైసిపినాయకులపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మిగనూరులో హజీరాబీపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని ప్రభుత్వం కాపాడుతోంది. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల రక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు. పిన్నెల్లి గ్రామంలో 100 ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తే, ఈ ముఖ్యమంత్రి  కనీసం ఖండించలేదు. ఇస్లామిక్ బ్యాంక్ బ్యాంకు ఏర్పాటు చేస్తానన్న. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపినేతలు అన్యాక్రాంతం చేశారు. టీడీపీ వచ్చిన మొదటి యేడాదిలోనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు అందిస్తాం. భవిష్యత్తులో ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యతను మరింత పెంచుతాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యలనూ టిడిపి సమర్థించబోదు. దుల్హన్ పథకంపై జగన్ ప్రభుత్వం విధించిన ఆంక్షను ఎత్తేసి పేద ముస్లింలందరికీ అవకాశం కల్పిస్తాం. ముస్లింలపై ఈ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులన్నీ మాఫీ చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పొడపాడు వైసిపి బాధితులు

పెదకూరపాడు నియోజకవర్గం పొడపాడులో వైసిపి బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని 170 ముస్లిం కుటుంబాలు, బిసిలు టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 3 కుటుంబాలు వైసీపీలోకి వెళ్లాయి. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన రూపాలక్ష్మికి వ్యతిరేకంగా మా ముస్లిం కుటుంబాల నుండి ఒకరిని వైసీపీ వాళ్లు పోటీకి దింపారు. దీంతో ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీ పోటీకి తీసుకొచ్చి పోలీసులతో మాపై దౌర్జన్యం చేయించారు. ముస్లిం కుటుంబాలకు చెందిన షేక్.చినమస్తాన్, మాజీ సర్పంచ్ మస్తాన్ వలిలను పోలీసులు అరెస్టు చేసి 3 రోజులు స్టేషన్లో నిర్బంధించారు. ఏజెంట్లుగా నిలబడిన వారిపై బైండోవర్ కేసులు బనాయించారు. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్నాం. ఓటమిని తట్టుకోలేక వైసీపీలో చేరిన కుటుంబాలను మేము వెలివేసినట్లుగా సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, గ్రామ నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు.  మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయించి, మాపై కేసులు బనాయించారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి నేతల దౌర్జన్యాలనుంచి మాకు విముక్తి కల్పించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో  వైసీపీ పాలనలో ముస్లింలు, బలహీనవర్గాలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 వేల మంది బీసీలపై ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. పిన్నెల్లి గ్రామంలో 100 ముస్లిం కుటుంబాలను వైసీపీ నేతలు గ్రామ బహిష్కరణ చేశారు. నర్సరావుపేటలో ఇబ్రహీం లాంటి ముస్లింలను నడిరోడ్డుమీదే చంపారు. 26 మంది బీసీలను హత్య చేశారు. ఎన్నికల్లో లొంగలేదని బిసిలు, ముస్లింలను తప్పుడు కేసులతో వేధించిన వారిని వదిలిపెట్టబోం. తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై విచారణ జరిపి, ఉద్యోగాలనుంచి డిస్మిస్ చేస్తాం. టిడిపి కేడర్ పై వేధింపులకు పాల్పడుతున్న వైసిపి కుక్కలకు గుణపాఠం చెప్పి తీరుతాం.

Also Read this Blog: Reclaiming Our Roots: Insights from Naralokesh’s Padayatra

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *