Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

2400 కి.మీ. మైలురాయిని చేరుకున్న యువగళం! దొడ్లేరులో ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకం

నేడు క్రోసూరు బహిరంగసభలో యువనేత ప్రసంగం

పెదకూరపాడు జనగళమే యువగళంగా యువనేత Nara Lokesh ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర మహాప్రభంజనమై సాగుతూ 180వ రోజు పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా  ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మాచాయపాలెం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు దారిపొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు లోకేష్ కు ఎదురేగి హారతులతో నీరాజనాలు పడుతూ గ్రామాల్లోకి స్వాగతించారు. మహిళలు, యువత వృద్ధులను కలిసిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు, ఇంటిపన్నులు, నిత్యావసర వస్తువుల ధరలతో బతుకుబండి లాగడం భారంగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మరికొద్ది రోజుల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. అనంతవరంలో టిడిపి అభిమానులు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. మాచాయపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చండ్రాజుపాలెం, కందిపాడు, దొడ్లేరు, అనంతవరం మీదుగా క్రోసూరు శివారు క్యాంప్ సైట్ కు చేరుకుంది. 180వరోజు యువనేత లోకేష్ 18.9 కి.మీ. ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2410.5 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో శుక్రవారం సాయంత్రం జరిగే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.

బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు!*

కందిపాడులో ఓ ఇసుక లారీని గమనించిన లోకేష్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసిపినేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసిపి మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యంగం, చట్టాలకు విలువలేదు. వైసిపి దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమేనంటూ లోకేష్ దుయ్యబట్టారు.

ముఖాముఖి సమావేశంలో వైసిపి బాధితుల ఆవేదన:

1.            శేషమ్మ, తంగెడ గ్రామం గురజాల : మాకు వైసీపీలో న్యాయం జరక్క 2019లో TDP లో చేరాం. టీడీపీలోకి వచ్చామని మా అమ్మను గొడ్డలితో నరికి చంపారు. నోట్లో పురుగుల మందుపోసి చంపారు. టీడీపీలోకి వెళ్లి బతుకుతావా..నువ్వు ఎలా బతుకుతావో చూస్తాం అని వైసీపీ నేతలు అన్నారు. ఒక్కదాన్ని చేసి చంపారు. ఇళ్లంతా చిల్లాకొల్లం చేశారు. మాకు న్యాయం జరగాలి..మా అమ్మను ఇబ్బంది పెట్టిన వాళ్లను శిక్షించాలి. మీకు ఎవరున్నారు అని అన్నారు.

2.            ఎల్లయ్య, జంగమహేశ్వరపాడు : కంచర్ల జాలయ్య, నేను దుర్గి నుండి బండిపై పెళ్లికి వెళ్లి వస్తుంటే వైసీపీ నేతలు బండిని అడ్డుకున్నారు. నా కాళ్లు, చేయి నరికారు. కంచర్ల జాలయ్యను ఊర్లోకి లాక్కెళ్లి చంపేశారు.

3.            కంచర్ల జల్లయ్య తల్లి, మాచర్ల : నా కొడుకు జాలయ్యను చంపే సమయంలో నేను బస్సులో వస్తున్నా. నా కొడుకుని కొడుతుంటే వదిలేయమని దండాలు పెట్టినా వదల్లేదు. ఎన్నికలయ్యాక మేము ఊరు విడిచి మాడుగులలో ఉంటున్నాం..పెళ్లికి వచ్చాం. నీ కొడుకు ప్రెసిడెంట్ అవుతాడా అంటూ గొడ్డలితో నరికారు. నా కొడుక్కి ముగ్గురు పిల్లలున్నారు. నువ్వు లోకేష్ దగ్గరకు వెళ్లే వాడివా అంటూ నా కొడుకును అన్నారు. చంపినవాళ్లను వదిలేసి, మాపైనే కేసు పెట్టారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి తన మనుషులతో నరికి చంపించాడు.

4.            దోమతోటి పిచ్చయ్య, అంబాపురం, గురజాల : నా తమ్ముడు విక్రమ్ 2019లో టీడీపీకి పనిచేశామని చంపారు. సీఐ దుర్గా ప్రసాద్ మా అన్నదమ్ములను పిలిచి స్టేషన్ లో కొట్టాడు. రూ.40 వేలు డబ్బులు తీసుకుని స్టేషన్ నుండి పంపారు. దీని తర్వాత నా తమ్ముడు హైదరాబాద్ వెళ్లాడు. ఓ గొడవ విషయంలో హైదరాబాద్ నుండి నా తమ్మున్ని స్టేషన్ కు పిలిపించారు. వైసీపీలోకి మారకపోతే చంపుతాం అని బెదిరించారు. మేము పార్టీ మారబోము అన్నాం..దీంతో నా తమ్ముడు స్టేషన్ నుండి వచ్చే సమయంలో దారికాచి చంపారు. ఇప్పటికీ మాపై ఒత్తిడి తెస్తున్నారు. నా తమ్మున్ని చంపిన వాళ్ల దగ్గర సీఐ డబ్బులు రూ.10 లక్షలు తీసుకుని కేసు లేకుండా చేశారు. నిందితున్ని జడ్పీటీసీని చేశారు.

5.            అన్వర్ బాషా, మాచర్ల పట్టణం : పది రోజుల క్రితం కారంపూడి పట్టణంలో మండల పార్టీ అధ్యక్షున్ని వైసీపీ నేతలు కొట్టారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులను ఆర్ అండ్ బి బంగ్లాలో పెట్టి మర్యాదలు చేశారు. ఎందుకు కొట్టారని అడగడానికి వెళ్తే మేమే కొట్టడానికి వచ్చామని 307 కేసులు పెట్టారు. మొదట నలుగురిపై పెట్టి, ఇతరులు అని రాసి 14 మందిపై కేసులు పెట్టారు. ఘటనలో నేను లేకపోయినా నాపైనా ఆ కేసులో 14వ ముద్దాయిగా పెట్టారు. బక్రీద్ కు ముందు రోజు కేసు పెట్టారు. నా కూతురు వచ్చి నాన్నా పండగకు ఇంటికి రావా అని అడిగింది. మేము స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నట్లు అనిపిస్తోంది. రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనికిరాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఇబ్బంది పెట్టాడు. మమ్మల్ని చంపితే పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే మా బలహీన వర్గాలను చంపుతున్నారు. ఎస్ఐ సీతారామాంజనేయులు 21 రోజులు కస్టోడియల్ టార్చర్ పెట్టారు. కోర్టుకు హాజరయ్యేదాకా నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు.

6.            సోమేపల్లి గోవర్ధన్, కారుమంచి గ్రామం, వినుకొండ నియోజకవర్గం : జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దీంతో బొల్లా బ్రహ్మనాయుడు తన డ్రైవర్ ను పంపించి మా ఇంటిపై దాడి చేయించాడు. దాడిలో నా ఎడమ కన్ను పూర్తిగా పోయింది. కుడికన్ను కూడా 30 శాతం దెబ్బతింది. అయినా నాపై కేసు పెట్టి వారం రోజులు రిమాండ్ కు పంపారు. అంతక ముందు రెండు సార్లు మాపై దాడి చేశారు. సీపీ ఫుటేజ్ లు కూడా అందించి కేసు పెట్టాలని అడిగితే పట్టించుకోలేదు. నాతో పాటు మరో వ్యక్తికి కళ్లు దెబ్బతిన్నాయి. 21 మందిపై కేసులు పెట్టారు..అందులో మహిళలు కూడా ఉన్నారు.

7.            గంగినేని అంజయ్య, కారుమంచి, వినుకొండ నియోజకవర్గం : 2016లో కారుమంచి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాం. 2019 అక్టోబర్ లో విగ్రహం ప్రారంభించాం. కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని బెదిరించారు. విగ్రహం ముందే వైసీపీ జెండా దిమ్మె పెట్టారు. విగ్రహానికి వైసీపీ జెండాలు కట్టారు. 2021 ఏప్రిల్ 4న మాపై దాడుల చేశారు. జడ్పీటీసీ గెలిచిన ఆనందంలో అడిగొప్పుల గుడికి వెళ్లాం. మా గ్రామం నుండి వైసీపీ నేతలు ఫోన్లు చేసి కారంపూడిలో దాడిలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనుచరులతో దాడులు చేయించారు.

8.            అచ్చిబాయి, రాజూ నాయక్ భార్య, భట్రుపాలెం, దాచేపల్లి మండలం : నా భర్తను పంచాయతీ చేద్దాం అని పలిచి చంపేశారు. నా భర్తను చంపినట్లు పోలీసులు వచ్చి నాకే చెప్పారు. కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోలేదు. నా భర్తను చంపినవాళ్లలో ఎవర్నీ అరెస్టు చేయలేదు. తగాదా పెట్టుకున్నామని మాపైనే కేసు పెట్టారు.

9.            తాళ్లూరు సుగుణమ్మ, పెదకూరపాడు, 75 తాళ్లూరు : చేయూత డబ్బులు పడలేదని సచివాలయానికి వెళ్లి అడిగితే రావన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి 10 మందితో కలిసి వెళ్లి మాట్లాడిన తర్వాత, మా వాలంటీర్ ఆన్ లైన్ చేయడం లేదని మీడియాతో చెప్పాం. వైసీపీ కండువాలు వేసుకుంటే చేయూత వచ్చేలా చేస్తామని చెప్పారు. వైసీపీ నేతలు మా ఇంటిపైకి వచ్చారు. నా కొడుకును ఇష్టానుసారంగా కొట్టారు. వైసీపీ నేతలు కొట్టిన దెబ్బలతో నా కొడుకు కోమాలోకి వెళ్లాడు. తల ఆపరేషన్ చేస్తే మెంటల్ వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఎంతో పోరాడితేకానీ నిందితులపై కేసు పెట్టలేదు.

10.          సంతోష్, నర్సీపట్నం బీసీ యువకుడు : ఎస్పీ రిషాంత్ రెడ్డి మొదటి బాధితున్ని నేనే. అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో బైక్ ర్యాలీ చేశాం. అప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు. స్టేషన్ కు పిలిచి బల్లపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టారు. కొట్టి పరుగెత్తాలని చెప్పారు..పరుగెత్తలేకుంటే మళ్లీ కొట్టేవాళ్లు. తలపై గన్ పెట్టి వాళ్లు పెట్టిన కేసులకు ఒప్పుకోవాలని అప్పట్లో ఏఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి బెదిరించారు.. కొడితే మేడపై నుండి పడ్డాను..దీంతో నా కాళ్లు విరిగాయి. 100 అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత నా తల్లిదండ్రులు వచ్చి పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగేళ్లైనా నాకు న్యాయం చేయలేదు. రిషాంత్ రెడ్డి వ్యక్తిని సస్పెండ్ చేయాలి.

11.          తురకా గంగమ్మ, సత్తెనపల్లి 31వ వార్డు : ఓ రెస్టారెంట్ లో నాకొడుకు అనిల్ పడి చనిపోయాడు. రూ.5 లక్షలు ప్రభుత్వ సాయం వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్తే మాకు కూడా అవసరాలు ఉంటాయి, రూ.2.5 లక్షలు ఇవ్వాలని అన్నాడు. దీంతో మేము చెక్కు తీసుకోలేదు. నాకు టీడీపీ నేతలు అండగా ఉండి రూ.2.5 లక్షలు అందించారు. ప్రభుత్వం నుండి వచ్చిన రూ.5 లక్షల చెక్కు ఇప్పటికీ మాకు ఇవ్వలేదు.

12.          వీరమ్మ, పీసపాడు, క్రోసూరు మండలం : మా పెద్దబ్బాయి నేతాజీ 2006లో ఆర్మీలో చనిపోయాడు. చిన్న కోడలుకు అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డ అని కూడా చూడకుండా స్కూలుపై దాడి చేశారు..స్కూల్లోకి నా కోడలును రానివ్వలేదు. నా కొడుకుపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. నీ కొడుకు ఆర్మీలో చనిపోతే నాకేంటమ్మా అని ఎస్ఐ అన్నారు. నా కొడుకుపై కేసు పెట్టాల్సిందే అని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నాడు. సైనికుడి తల్లిగా నాకు ఏ ఆహ్వానం కూడా రాకుండా చేశారు. నా భర్తను స్టేషన్ లో కొట్టారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ నా కోడలును అంగన్వాడీ పోస్టులోకి తీసుకోలేదు. జగన్ ను సైకో అన్నందుకు వారం క్రితం నాపై హత్యాయత్నం కేసు పెట్టారు.

13.          ఊర్మిళ, తుమ్మలచెరువు  గ్రామం మాజీ సర్పంచ్, గురజాల నియోజకవర్గం : 2020లో మా 11 ఏళ్ల కొడుకు చనిపోయాడు. జడ్పీ హైస్కూల్ పక్కన ఆడుకోవడానికి వెళ్లి వైసీపీ నేతలు మైనింగ్ కోసం తీసిన గుంతల్లో పడి చనిపోయాడు. నా కొడుకు సంతోష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనపై ఇప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా విచారణ చేయలేదు. కాసు మహేశ్ రెడ్డి అక్రమ మైనింగ్ కారణంగా 8 మంది చనిపోయారు.

14.          వీరాంజనేయులు, వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోట్ల రూపాయల మైనింగ్ చేశాడు. దాన్ని జీవీ ఆంజనేయులు మీడియా సమక్షంలో నిరూపించారు. దీనిపై నట్లు, బోల్టులు పోయినట్లు మాపై ఎమ్మెల్యే బొల్లా కేసులు పెట్టారు. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి అర్జీ ఇవ్వడానికి వెళ్తుంటే ఎమ్మెల్యే మా మధ్యకు వచ్చి నా కొడకల్లారా రండి చూసుకుందాం అని తొడలు కొట్టాడు. పోలీస్ జీపుల్లోనే కర్రులు తెచ్చుకుని రాళ్లు విసిరారు. పోలీసులతో మాపైనే లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల వెనక వైసీపీ కార్యకర్తలు వస్తున్నా వాళ్లను ఏమీ అనలేదు. సీఐ గన్ తీసి గాల్లోకి కాల్పలు జరిపారు. కావాలనే గన్ ఫైరింగ్ చేశారు. మావైపు గన్ చూపించి బెదిరించారు. నన్ను కొడితే తలకు 7 కుట్లు పడ్డాయి..నా వీపు మొత్తం లాఠీ దెబ్బలే ఉన్నాయి.

నారా లోకేష్ ను కలిసిన చండ్రాజుపాలెం గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం చండ్రాజుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి సాగర్ కాల్వ ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించాలి. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను ఎమ్మాజీగూడెం నుండి ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్ కు మళ్లించినట్లైతే మా గ్రామంతో పాటు మరో వంద గ్రామాలకు నీటి ఇబ్బందులు తప్పుతాయి. అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలు అందించాలి.  గ్రామంలోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి నీటిని నింపాలి. 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న చెరువు పోరంబోకు భూములపై మాకు హక్కులు కల్పించాలి. అటవీ భూముల్లోని కొంత భాగాన్ని పశువులు, గొర్రెలు మేపుకునేందుకు కేటాయించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కరవై రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టకపోవడంతో వాస్తవ సామర్థ్యంలో 50శాతం నీరు కూడా రైతులకు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి చివరి భూములకు నీరందిస్తాం. పులిచింతల బ్యాక్ వాటర్ ను మళ్లించే అంశాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం. దీర్ఘకాలంగా అటవీ భూములు, చెరువు పోరంబోకు భూములు సాగుచేసుకుంటన్న వారికి నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కందిపాడు గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కందిపాడు గ్రామంలోని కొండపైన వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ప్రతి ఉగాదికి తిరునాళ్ల జరుగుతుంది. కొండపైకి రోడ్డు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. బెల్లంకొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలి. మా గ్రామాల గుండా నాగార్జున సాగర్ ఎన్ఎస్పీ కాల్వ ఉంది. ఎన్ఎస్పీ కెనాల్ కు ఎమ్మాజీగూడెం వద్ద పులిచింతల బ్యాక్ వాటర్ ఉంది.  ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ఎస్పీ కెనాల్ కు మాచాయపాలెం వద్ద లింక్ చేస్తే బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని గ్రామాలకు చివరి ఆయకట్టు వరకూ నీరందుతుంది.  కందిపాడు గ్రామంలోని చెరువుకట్టపైన గండి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గండిపై బ్రిడ్జి నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. వైసీపీ  అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. కందిపాడు కొండపై ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసింది.  పులిచింతల బ్యాక్ వాటర్ ను ఎన్ఎస్పీ కెనాల్ లోకి మళ్లించే అంశాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తాం. గ్రామంలోని చెరువుకట్టపై బ్రిడ్జి నిర్మించి రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఆవులవారిపాలెం గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం ఆవులవారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామం ఏర్పడి 40 ఏళ్లు అవుతున్నా ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పడలేదు.  ఆవులవారిపాలెం భూములు చండ్రాజుపాలెం, హసానాబాద్, దొడ్లేరు శివారు రెవెన్యూలో ఉన్నాయి. టీడీపీ హయాంలో మా గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గ్రామంలోని అంతర్గత రోడ్లు మట్టివి కావడంతో అస్తవ్యస్తంగా మారాయి.  2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొంతమేరు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క సీసీ రోడ్డు కూడా నిర్మించలేదు. టీడీపీ పాలనలో వేసిన రోడ్లకు బిల్లులు చెల్లించలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతుదారులు నామినేషన్ ఉపసంహరించుకోలేదని సర్పంచ్ అభ్యర్థితో సహా24 మందిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

500 జనాభా దాటిన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా చేస్తానని చెప్పిన వైసీపీ  మాటతప్పారు. ఆవులవారిపాలెం గ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తాం. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. వైసీపీ దివాలాకోరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్టిమట్టి పోసే దిక్కులేదు. కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లు పెండింగ్ లో పెట్టడంతో ఈ ప్రభుత్వంలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను చెల్లిస్తాం. టిడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన అనంతవరం గ్రామస్తులు

పెదకూరపాడు నియోజకవర్గం అనంతవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి నాగార్జున సాగర్ నీరు అందక ఆయకట్టు కింద  ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి – పెన్నా – కృష్ణా నదులను అనుసంధానంలో భాగంగా వైకుంఠపురం నుండి సాగర్ ప్రధాన కాల్వకు నకరికల్లు వద్ద కలిపితే 9లక్షల ఎకరాలకు నీరందించే అవకాశముంది. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు భూములకు సరిగా నీరందకపోవడంతో బీడు పెట్టుకోవాల్సి వస్తోంది..నదుల అనుసంధానం చేస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.  గ్రామంలోని ఎస్సీలు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. బీసీ కాలనీకి దక్షణ భాగంలో వాగులో 4 అడుగుల నీరు నిల్వ ఉండే ప్రాంతంలో స్థలాలివ్వడంతో నిర్మాణ పనులు చేయడానికి కూడా అధికారులు మందుకు రావడం లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కాలనీకి పడమర భాగాన ఉత్తభాగాన స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలి. గ్రామానికి దక్షిణ భాగాన ఉన్న పొలాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుని వెళ్లాల్సి వస్తోంది.  పొలాలకు వెళ్లే సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు..మీ ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

టీడీపీ చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకోవడం తప్ప నాలుగేళ్లుగా జగన్ చేసిందేమీ లేదు. దేశ చరిత్రలోనే నదుల అనుసంధానం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు. నదుల్లో ఇసుక దోచుకునేందుకు ప్రాజెక్టులనే కొట్టుకుపోయేలా చేశాడు ఇసుకాసురుడు జగన్ రెడ్డి. టీడీపీ వచ్చిన వెంటనే నదుల అనుసంధాన పనుల్లో వేగం పెంచుతాం. వైసీపీ నేతలకు రాజప్రసాదాలు..సామాన్య ప్రజలకు ముంపు ప్రాంతాల్లో స్థలాలా? ఇళ్ల స్థలాల చదును, తక్కువ ధర ఉన్న స్థలాలకు ఎక్కువ నిధుల కేటాయింపులతో సమారు రూ.7 వేల కోట్ల కొట్టేశారు. అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల్లో అవినీతిన సొమ్ము కక్కిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం.

Also Read this Blog:People’s Voice on the Move: Naralokesh’s Padayatra Experience

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *